టిక్‌టాక్ చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్న పోలీసమ్మ..
చిన్న పెద్ద అని తేడా లేకుండా టిక్‌టాక్ అందరికి అలవాటైపోయింది. టిక్‌టాక్ కొందరిని సెలబ్రెటీలను చేస్తే మరికొందరిని ఇబ్బందుల్లో పడేస్తోంది. తాజాగా ఓ లేడీ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌లోనే టిక్‌టాక్ చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయింది. గుజరాత్‌లోని లాంఘ్ణజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అర్పిత చౌదరి వయ్యారాలకు పోతూ ఓ బాలీవుడ్ పాటకు టిక్‌టాక్ చేసింది. దీన్ని పలు సోషల్ మీడియాల్లో ప్లాట్ ఫామ్‌లపై పోస్ట్ చేసింది. వారం క్రితం చేసిన ఈ వీడియో వైరల్‌గా మారి చివరకు పోలీస్ ఉన్నతాధికారులు వద్దకు చేరింది. దీంతో క్రమశిక్షణ చర్యల్లో బాగంగా అర్పితాను సస్పెండ్ చేశారు. ఇటీవల ఖమ్మం మున్సిపాలిటీ ఉద్యోగులు కొందరు టిక్ టాక్ వీడియోలు చేసి బదిలీకి గురైన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగులు టిక్ టాక్ వ్యసనం బారిన పడి ఉద్యోగం పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com