ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

వికెట్ల వెనుక నిలబడి మెరుపు వేగంతో స్టంపింగ్‌లు చేయడం.. క్రీజ్‌లోకి వచ్చాక బ్యాట్‌తో బౌండరీలు బాదడం మాత్రమే కాదు.. దేశ రక్షణలోనూ ముందే ఉంటున్నాడు మహేంద్ర సింగ్‌ ధోనీ. కేవలం మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తున్నాడు. వరల్డ్‌ కప్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. విండీస్‌ టూర్‌ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సైన్యంతో కలిసి విధుల్లో తానూ భాగం కావాలని భావించడంతో విండీస్‌ టూర్‌కు దూరమయ్యాడు..

లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ పారా మిలటరీ సైనికుడిగా జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకూ సేవలందించనున్నాడు. పెట్రోలింగ్, గార్డ్‌గా దేశ సైన్యంలో ధోనీ విధుల్లో చేరనున్నాడు. కశ్మీర్‌ వ్యాలీలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోనీ విధులు నిర్వహించనున్నాడు. 2011లో ధోనీ టీమిండియాకు అందించిన సేవలకు గానూ భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ధోనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సైనిక ఉన్నతాధికారులు అభినందించారు..

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల వరల్డ్‌ కప్‌లో స్లో బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.. ప్రస్తుతం ధోనీ లోని దేశభక్తి చూసి.. అంతా మహేంద్రుడ్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story