ఆంధ్రప్రదేశ్

జంటహత్యల కేసులో మాజీ మంత్రికి ఊరట

జంటహత్యల కేసులో మాజీ మంత్రికి ఊరట
X

సంచలనం రేపిన షాద్‌నగర్‌ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట కలిగింది.ఈ కేసులో రామ సుబ్బారెడ్డిని నిర్దోషిగా తేలుస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీం కోర్టు సమర్థించింది. 1990 డిసెంబర్ 5న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాద్‌నగర్ బస్టాండ్‌లో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బాబాయి దేవగుడి శివశంకర్ రెడ్డి ఆయన స్నేహితుడు లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డి హత్యకు గురయ్యారు. ఈకేసులో రామసుబ్బారెడ్డితోపాటు మరో 9 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అప్పటి నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసును 2006లో హైకోర్టు కొట్టివేసింది.ఈ తీర్పుతో సంతృప్తి చెందని ఆదినారాయణరెడ్డి కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. ఇప్పుడీ కేసును కొట్టేసిన న్యాయస్థానం.. 10 మందిని నిర్దోషులుగా పేర్కొంది.

జంట హత్యల కేసు నుంచి రామసుబ్బారెడ్డికి ఊరట లభించడంతో ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు..జమ్మలమడుగులోని టీడీపీ పార్టీ ఆఫీసులో మిఠాయిలు పంచుకున్నారు....

Next Story

RELATED STORIES