నాకే ఇలా ఉంటే.. తనకెలా ఉందో: రష్మికా మందన

నాకే ఇలా ఉంటే.. తనకెలా ఉందో: రష్మికా మందన

డియర్ కామ్రెడ్లో తనో క్రికెటర్. అందుకోసం క్రికెట్ బ్యాట్ పట్టి ఫోర్లు, సిక్స్‌లు కొట్టేసిందట. ఓ రెండు నెలలపాటు క్రికెట్ కూడా నేర్చుకున్నానంటోంది హీరోయిన్ రష్మిక. ఈ నెల 26న విడుదల కాబోతున్న చిత్రం డియర్ కామ్రెడ్.. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. ఇందులో స్టేట్ లెవల్ క్రికెటర్‌గా కనిపిస్తాను. సినిమాల్లో బ్యాట్ పట్టుకుంటేనే నాకిలా ఉంది. అలాంటిది వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఎంఎస్ ధోనీ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకుంటేనే కష్టంగా ఉంది. ఆ మ్యాచ్‌లో ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడం నన్ను బాధించింది. ధోనీ రనౌట్ అయ్యాడని అంపైర్ ప్రకటించగానే నా గుండె ఆగినంత పనైంది. నాకే ఇలా ఉంది.. స్టేడియంలో కూర్చున్న వేలాది మందికి.. టీవీల్లో చూస్తున్న కోట్లాది మందికి .. ముఖ్యంగా రనౌట్ అయిన ధోనీకి ఇంకెంత బాధగా ఉంటుందో అర్థమైంది అని అంటోంది. ఇక ఈచిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది రష్మిక.

Tags

Read MoreRead Less
Next Story