అమ్మ ఒడికి చేరిన జషిత్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యంది. కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ సురక్షితంగా తిరిగొచ్చాడు. ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం కుతుకులూరు దగ్గర బాలుడ్ని వదిల వెళ్లారు కిడ్నాపర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో జషిత్ ను మండపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు.. ఆ తర్వాత అతని తల్లిదండ్రులకు అప్పగించారు. మూడ్రోజుల తర్వాత కన్నకొడుకును చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కిడ్నాపర్ల చెరలో ఎలా ఉన్నాడో తెలియక అల్లాడిపోయిన పేరెంట్స్.. కొడుకును ముద్దుల్లో ముంచెత్తారు.
మండపేటలోని విజయలక్ష్మీనగర్ లో సోమవారం రాత్రి జషిత్ ను ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు. నానమ్మ పార్వతిపై దాడి చేసి బైక్ పై తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును చేధించేందుకు ఎస్పీ నయీం అస్మీ రంగంలోకి దిగారు. బాలుడి ఆచూకీ కోసం ఏకంగా 17 బృందాలు రంగంలో దిగాయి. మరోవైపు మీడియా, సోషల్ మీడియాలో జషిత్ ఫోటోలతో కిడ్నాప్ కేసుపై విపరీత ప్రచారం కల్పించాయి. దీంతో భయపడిపోయిన కిడ్నాపర్లు జషిత్ ను ఈ ఉదయం కుతుకులూరు దగ్గర వదిలేసి పారిపోయారు.
RELATED STORIES
Nandyala: పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు మృతి.. అనుమానాస్పద స్థితిలో..
25 Jun 2022 1:00 PM GMTCrime News: మూఢ భక్తి.. నాలుక కోసి దేవుడికి సమర్పించి..
25 Jun 2022 6:26 AM GMTMedchal: మేడ్చల్లో విషాదం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల...
23 Jun 2022 2:25 PM GMTNellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి ...
20 Jun 2022 3:05 PM GMTMaharastra: షాకింగ్.. ఆ ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. ఆత్మహత్యగా...
20 Jun 2022 11:45 AM GMTPalnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. బాలికపై కొన్ని నెలలుగా యువకుడి...
20 Jun 2022 9:30 AM GMT