వాట్సాప్‌ వార్త ఎంత పనిచేసింది.. బతికుండగానే చంపేసింది

వాట్సాప్‌ వార్త ఎంత పనిచేసింది.. బతికుండగానే చంపేసింది

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. అర్ధంలేని మెసేజ్‌లతో బతికి ఉన్నవారిని కూడా చంపేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు నకిలీ వార్తల ప్రచారానికి కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా ఓ సామాన్యుడు కూడా సోషల్ మీడియా దెబ్బ ఏంటో రుచి చూశాడు. అతను బతికి ఉండగానే చనిపోయాడంటూ ఓ వార్త వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తను ముందు అంతగా పట్టించుకోని అతను తర్వాత మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించాడు.

ముంబైకి చెందిన రవీంద్ర దుసాంగే అనే వ్యక్తి చనిపోయాడంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశారు. ఆ న్యూస్ దావనంలా వ్యాప్తి చెందింది.ఇంకేముంది దుసాంగే కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ సంతాపాలు తెలుపుతున్నారు. ఇలా మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ సంఖ్య పెరుగుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. తొలుత ఈ వార్తను అంతగా పట్టించుకోలేదు. తర్వాత నా స్నేహితులకు, బంధువులకు కూడా ఈ మెసేజ్‌లు రావడంతో వారు కొంత ఆందోళనకు లోనయ్యారు. ఈ విషయం మా కుటుంబ సభ్యులకు తెలిసి చాలా బాధపడ్డారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను’ అని తెలిపాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story