నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి : చంద్రబాబు

నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి : చంద్రబాబు
X

గోదావరి జలాల వినియోగంపై జరిగిన చర్చలో మాట్లాడిన చంద్రబాబు... నీటి సమస్య చాలా సున్నితమైందని అన్నారు. చెన్నై, బెంగుళూరు మధ్య ఇప్పటికీ నీటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. గోదావరిలోవృథాగా పోతున్న నీటిని కాపాడుకోవాలన్నదే తమ తపన అని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు.

మన డబ్బుతో తెలంగాణలో ప్రాజెక్టు కడితే ఏపీ కంట్రోల్‌లో ఉండదని పేర్కొన్నారు చంద్రబాబు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాల విషయంలోనూ గోడవలు జరిగాయని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణంపై అభ్యంతరం చెబుతూ తెలంగాణ , ఒడిశాలు సుప్రీంలో కేసులు వేశాయని తెలిపారు. ఏపీ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు చంద్రబాబు.

Tags

Next Story