తండ్రీ కూతుళ్లను కార్లో తిప్పిన కేటుగాడు.. తండ్రిని దింపేసి.. యువతితో పరార్!

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ యువతి కిడ్నాప్‌ మిస్టరీ ఇంకా వీడలేదు. మూడ్రోజుల క్రితం.. నర్సింగ్‌ కోర్సు చదువుతున్న సోనిని.... శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి... అపహరించడం కలకలం రేపుతోంది. యువతిని విజయవాడ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మూడ్రోజుల క్రితం హయత్ నగర్‌లో యువతి కిడ్నాప్‌ గురైన ఘటన ఇది. తనను తాను శ్రీధర్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు.. మాయమాటలు చెప్పి.. యువతితో పాటు తండ్రిని బుట్టలో వేసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించాడు. దీంతో కూతురితో పాటు ఆ ఆగంతకుడి కారులో వెళ్లాడు ఆ టీ దుకాణం ఓనర్‌. తండ్రీ కూతుళ్లను హైదరాబాద్‌లో కొద్దిసేపు తిప్పిన కేటుగాడు.. చివరకు సర్టిఫికెట్లు జిరాక్స్‌ తీసుకురావాలని తండ్రిని దింపాడు. అతను అటు వెళ్లగానే.. యువతితో పాటు కారులో పరారయ్యాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నారు. యువతిని విజయవాడవైపు తీసుకెళ్లినట్లు గుర్చించారు పోలీసులు. కారు నంబర్‌ను సైతం గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా విజయవాడలో గాలిస్తున్నారు.ఈ కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. యువతితో పాటు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. త్వరలోనే ఈ కేసును చేధిస్తామని, యువతిని వారి కుటుంబానికి అప్పగిస్తామంటున్నారు పోలీసులు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. అగంతకులను నమ్మి మోసపోవద్దంటున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story