బ్యాడ్‌లక్.. 'రంగస్థలం' మిస్సయ్యాను..

బ్యాడ్‌లక్.. రంగస్థలం మిస్సయ్యాను..

కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయేమో.. సమంత చేసిన పాత్రకు ముందు అనుపమ పరమేశ్వరన్‌ని అనుకున్నారట దర్శక నిర్మాతలు. డేట్లు అడ్జస్ట్ కాక ఆ పాత్ర సమంత దగ్గరకు వెళ్లింది. అందుకు చాలా బాధపడ్డా.. సినిమా చూశాక సమంతే కరెక్ట్ అనిపించింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుపమ. తమిళంలో అమల పాల్ నటించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంలో అనుపమ హీరోయిన్. ఓ టీచర్‌గా చీరకట్టులో కనిపిస్తుంది. మొదట ప్రేమమ్ రీమేక్‌లో, ఇప్పుడు రాక్షసన్ రీమేక్‌లో నటించాను అని చెప్పుకొచ్చింది. దీని తరువాత నిన్నుకోరి తమిళ రీమేక్‌లో చేస్తున్నాను అని చెప్పింది.

ఇక టిక్ టాక్ వీడియోలు ఎక్కువగా చేస్తుండడంతో టిక్‌టాక్ క్వీన్ అని అందరూ అనుపమని పిలుస్తున్నారు. నటిగానే కాదు సహాయ దర్శకురాలిగా కూడా తెరవెనుక తన ప్రతిభను కనబరుస్తోంది అనుపమ. తమిళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసింది. తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి. మరి మరింత పట్టు వచ్చాక మెగా ఫోన్ చేతబట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంతకీ క్రికెటర్ కే.ఎల్ రాహుల్‌తో ప్రేమాయణం మాటేంటి అంటే.. ఆ ఒక్కటీ అడక్కండి ప్లీజ్.. అంటూ దాటవేసింది.

Tags

Read MoreRead Less
Next Story