పాలిట్‌బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. పార్టీకి పొలిటికల్ పార్టీకి కీలకమైన పాలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించారు. దాదాపు అందరూ సీనియర్ నేతలతో ఆయన ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల తరువాత పార్టీ ఓటమిపై సమీక్షలు చేసిన పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఈ కమిటీలను ప్రకటించారు.
క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు. పాలిట్ బ్యూరో సభ్యులుగా.. నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్, రాజు రవితేజ్, అర్హం ఖాన్ ను నియమించారు. ఇక పొలిటికల్ అపైర్స్ కమిటీలో.. కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను నియమించారు. సభ్యులుగా.. తోట చంద్రశేఖర్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కొణిదల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, మనుక్షాంత్ రెడ్డి, ఎ.భరత్ భూషణ్, బి.నాయకర్ లను పవన్ నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com