ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌

ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌

ఆట అనేది గెలుపు కోసం ప్రాణాలు తీసేందుకు కాదు. రింగ్‌లో ఉన్నది ప్రత్యర్ధి కానీ శత్రువు కాదు. కొందరు ఆటగాళ్ళ విచక్షణ మరిచి ఎదుటి వ్యక్తిని శత్రువుగా

భావించి ప్రాణాలు తీసున్నారు. రింగ్‌ను యుద్ద క్షేత్రంగా మారుస్తున్నారు. ప్రత్యర్ధుల పిడిగుద్దులు తాళలేక ఇద్దరు బాక్సర్‌లు ప్రాణం కోల్పోయారు. రష్యా చెందిన బాక్సర్‌ మాక్సిమ్‌ డడ్‌షెవ్‌ మంగళవారం తుది శ్వాస విడవగా తాజాగా అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్‌ అనే మరో బాక్సర్ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు.

గత శనివారం ఉరేగ్వే బాక్సర్‌ ఎడ్వర్డో అబ్రెతో జరిగిన బౌట్‌ను డ్రా చేసుకున్న సాంతిల్లాన్‌ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో ఇరువురి బాక్సర్ల చేతులను పైకి ఎత్తే క్రమంలో సాంతిల్లాన్‌ రింగ్‌లోనే పడిపోయాడు. తీవ్రగాయాలైన అతనిని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెదడులో రక్తం గడ్డ కట్టుకపోవడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్‌ ప్రాణాలు విడిచాడు. అతని మృతిపై రల్డ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాంతిల్లాన్‌ ఇప్పటివరకు 19 విజయాలు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Tags

Read MoreRead Less
Next Story