పిల్లి ఎంత పని చేసింది

ఆది నుంచి పశుపక్ష్యాదులతో మానవునికి అవినాభావ సంబంధం ఉంది. ఇంట్లో సరదా కోసం జంతువులను పెంచుకుంటాం. అవి చేసే చిలిపి పనులను చూసి మురిసిపోతాం.అవి ఎంతైనా ముగజీవాలు కనుక కొన్ని సార్లు విచక్షణ మరిచి ప్రవరిస్తుంటాయి. అవి మనకు కూడా నవ్వుతెప్పిస్తుంలుంది. ఇలానే గ్రీడ్ అనే వ్యక్తి తన పెంపుడు పిల్లతో ఓ వింత ఓ అనుభవాన్ని ఎదుర్కున్నాడు. ఆయన కొద్ది రోజులుగా నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇలా జరగడానికి అధృశ్య శక్తుల పనేమో అనుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుందో అర్ధంకాక తల పట్టుకున్నాడు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఓ రోజు తన బెడ్రూంలో సీసీకెమెరా పెట్టి పడుకున్నాడు.
ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలాగే నిద్రపోయాడు. తిరిగి అతనికి అలాంటి పరిస్ధితే ఎదురైంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఉదయం నిద్ర లేచాక కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూశాడు. వాటిని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అసలు విషయం ఏంటంటే గ్రీడ్ నిద్రపోయిన తర్వాత అతడి పెంపుడు పిల్లి వచ్చి అతడి ముఖం మీద పడుకుంటుంది. దీంతో అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఇదంతా కెమెరాలో రికార్డయ్యింది. సమస్యకు అసలు కారణం తెలిసిన తర్వాత గ్రీడ్ నవ్వుకున్నాడు. తర్వాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
“I couldn’t breathe when I slept so I installed a camera” pic.twitter.com/DDhP0OweoW
— Greed (@stluis_htx) July 22, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

