కొత్త మున్సిప‌ల్ పాల‌సీపై తెరాస నేతల్లో బెంగ..

కొత్త మున్సిప‌ల్ పాల‌సీపై తెరాస నేతల్లో బెంగ..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం కొత్త పాల‌సీల‌ను ఆగ‌మేగాల‌మీద తీసుకొచ్చారు సీఎం కేసీఆర్‌. ఈ చట్టంతో తిరుగులేని పాల‌న అందిస్తామ‌ంటున్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని , అవినీతి జ‌రిగితే ప్ర‌జాప్ర‌తినిధుల‌,ఉద్యోగులు తీసేస్తామ‌ంటున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోకి వెళ్ల‌ేందుకు ఈ చట్టం ఎంతోగానే ఉపయోగపడుతోందని భావిస్తున్నా ఆ పార్టీ నేతలకు ఒకింత బెంగ‌ప‌ట్టుకుంద‌నే చెప్పాలి. ఇందుకు కార‌ణం నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, కో ఆర్డినేష‌న్ లేక‌పోవ‌డం. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఇలానే జ‌రిగింది. నేత‌ల మ‌ధ్య గొడ‌వల కారణంగా ఒక‌రినొక‌రు ఓడించుకున్నారనే విమర్శలు తలెత్తాయి. ఇది టిఆరెస్ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసింది. ఇక ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కూడా కొంప‌ముంచింది. ఒక్క కేసిఆర్ చాలంటూ ..... పార్టీ శ్రేణులు ఎన్నిక‌ల‌ను లైట్ తీసుకున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి..

లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు త‌మ‌వేనన్నారు కేసీఆర్‌. కానీ కేవ‌లం 9 సీట్ల‌తోనే స‌రిపెట్టు కోవాల్సి వ‌చ్చింది. ఈ ఫ‌లితాల‌పై విశ్లేష‌ణ చేసిన కేసిఆర్.... అస‌లు త‌ప్పంతా సొంత పార్టీ నేత‌ల‌దేనని తేల్చేశారు. గెలుస్తుంద‌న్న ధీమా నేత‌ల్లో ఉండ‌టమే కొంప‌ముంచింద‌న్న భావ‌న అధిష్టానంలో ఉంది. అంతా కేసిఆర్ ఛ‌రిష్మాతోనే గెలుస్తామ‌ని దీమాతో ఉన్న నేత‌ల‌కు లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఝ‌ల‌క్ ఇచ్చారు. దీంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను సీరియస్ తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. ఇప్ప‌టికే ఎంపిలు,మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మ‌న్లు, అన్ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ ల‌తో స‌మావేశ‌మైయ్యారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం 69మంది ఇంచార్జీల‌ను నియ‌మించారు...

మరోవైపు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సైతం వ‌రుస మీటింగులు నిర్వ‌హిస్తున్నారు. లోపాల‌ను అధ్యయ‌నం చేస్తూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేల‌కు కేసిఆర్ ఇప్ప‌టికే సీరియ‌స్ వార్నింగ్ లు కూడా ఇచ్చిన‌ట్టు ప్రాచ‌రం జ‌రుగుతుంది. టిఆరెస్ లోక్ స‌భ స్థానాలు కొల్పోయిన నిజామాబాద్ , క‌రీంన‌గ్, ఆదిలాబాద్ జిల్లా నేత‌ల‌కు మున్సిప‌ల్ ఎన్నిక‌లతో మెడ‌మీద క‌త్తి ఏలాడుతుంది. గ‌తంలో ఉమ్మ‌డి నిజామావాద్ లో నిజామాబాద్ కార్పోరేష‌న్ తో పాటు భోద‌న్ ,ఆర్మూరు, కామారెడ్డి , క‌రీంన‌గ‌ర్ లోక్ స‌భ ప‌రిధిలో భాగ‌మైన కోరుట్ల,మెట్ ప‌ల్లి అన్ని టిఆరెస్ వే. కొత్త‌గా భాన్సువాడ‌,ఎల్లారెడ్డి, భీంగ‌ల్ మున్సిపాల‌టీలు ఏర్ప‌డ్డాయి.

టిఆరెస్ కు ఎంత బ‌లం ఉన్నా గ‌త లోక స‌భ ఎన్నిక‌ల్లో క‌విత ఓట‌మి పాలైంది. ఇక క‌రీం న‌గ‌ర్ టిఆరెస్ కు సెంటిమెంట్ గా భావిస్తారు. కానీ ఇక్క‌డ కూడా గుల‌బీ పార్టీకి గ‌త ఎన్నిక‌లు గ‌ట్టి ఎదుదెబ్బ త‌గిలింది. క‌రీంన‌గ‌ర్ , రామ‌గుండం కార్పోరేష‌న్ ల‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు టిఆరెస్ చేతిలో ఉన్నా లోక్ స‌భ ఫ‌లితాలు మాత్రం బిజేపికి అనుకూలంగా వ‌చ్చాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క బైంసా లో ఎంఐఎం త‌ప్పా ఆదిలాబాద్ , నిర్మల్ ,మంచిర్యాల ,బెల్లంప‌ల్లి, మంద‌మ‌ర్రి, కాగ‌జ్ న‌గ‌ర్ మున్సిపాలిటీల్లో కూడా టిఆరెస్ ఉంది.ఇప్పుడు కొత్త‌గా ఖానాపూర్, నాస్ పూర్, ల‌క్సెట్ పేట్, చెన్నూరు, ఉట్నూర్, ఆసిఫాబాద్ మున్సిప‌లీటీలను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ కూడా టిఆరెస్ బ‌లంగా ఉన్నా బిజేపికే అనుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం సొంత ఎమ్మెల్యేల అల స‌త్వ‌మేన‌ని తేలింది. ఇప్పుడు మున్పిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా సీన్ రిపీట్ అయితే అధికార పార్టీ కి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని బావించారు . దీంతో నేత‌ల‌కు టార్గెట్ లు పెట్టారు గులాబీబాస్.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టార్గెట్ ల‌కు కూడా పెట్టిన‌ట్టు స‌మాచారం ఎవ‌రెన్ని మున్సిపాలిటీలు గెల‌పిస్తే పార్టీలో అగ్ర‌స్థానం ద‌క్క‌నున‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది, అందే కాదు మున్సిప‌ల్ ఎన్నిక‌లు కొంద‌రికి డిమోష‌న్ ,మ‌రి కొంద‌రికి ప్ర‌మోష‌న్ కూడా వ‌రించ‌న‌ట్టు తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా 69మంది ఇంచార్జిల‌ను నియ‌మించి పూర్తి స్థాయిలో మున్పిప‌ల్ ఎన్నిక‌ల‌పై న‌జ‌ర్ పెట్టింది.

అన్ని మున్సిపాలిటీలు టిఆరెస్ ద‌క్కించుకునేలా అన్ని ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు లేకుండా జాగ‌ర్త ప‌డుతున్నారు. బిజేపికి ఒక్క మున్సిపాలిటీ కూడా ద‌క్క‌వ‌ద్ద‌ని ప్ర‌తీ మీటింగ్ లో నేత‌ల‌కు చెబుతున్నారు. ఇప్ప‌టికే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో న‌ష్టం జ‌రిగింద‌ని... ఇప్పుడు జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా అలా జరిగితే తెలంగాణ‌లో బిజిపి ఖాల‌ర్ ఎవ‌ర‌వేస్తుంద‌ని నేత‌ల‌కు వార్నింగ్ ఇస్తున్నారు. లేక‌పోతే త‌గిన ప‌రిణామాలు కూడా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.. . నేత‌ల మ‌ధ్య ఎలాంటి కోఆర్డినేష‌న్ ఉంటుందో.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఏమేర‌కు ప‌నిచేస్తారో చూడాలి మ‌రి.

Tags

Read MoreRead Less
Next Story