ప్ర‌తి నెల ఇద్ద‌రు కేంద్ర మంత్రులు తెలంగాణ‌కు.. ఎందుకో తెలుసా?

ప్ర‌తి నెల ఇద్ద‌రు కేంద్ర మంత్రులు తెలంగాణ‌కు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ‌లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ హైకమాండ్‌ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. . ప్ర‌తి నెల ఇద్ద‌రు కేంధ్ర మంత్రులను తెలంగాణ‌లో ప‌ర్య‌టించేలా ప్లాన్ చేసింది. పార్లమెంట్ సేష‌న్స్ ముగిసిన వెంట‌నే మంత్రులు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఇప్ప‌టికే ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి శ‌ని , ఆది వారాల్లో సికింద్ర‌బాద్ లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్యటిస్తూ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. కేంద్రప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఎలా దారిమ‌ళ్ళిస్తుందో వివ‌రిస్తున్నారు. గ‌త నెల‌లో రెండు సార్లు రాష్ట్రానికి వ‌చ్చిన అమిత్ షా... రాష్ట్ర కార్య‌వ‌ర్గంతో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. నిరంత‌రం జనంలోనే ఉండి .. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో పోరాడాల‌ని సూచించారు. భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్ర స‌మితితో ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని ఒంట‌రిగానే ప్ర‌జాక్షేత్రంలో బ‌లం నిరూపించుకునేలా నేత‌లు , కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల‌ని స్ప‌ష్టం చేసారు అమిత్ షా.

రాష్ట్రంలో పార్టీ భ‌లోపేతం కోసం అమిత్ షా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తానే స్వ‌యంగా తెలంగాణ‌లో రంగంలోకి దిగాల‌ని భావిస్తున్నారు. గాంధీ న‌గ‌ర్ నుండి పోటీ చేసి గెలిచిన ఆయ‌న ప్ర‌స్తుతం కేంధ్ర హోం మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే ఆయ‌న తెలంగాణ‌లో పార్టీ భ‌లోపేతం చేసే దిశ‌గా ప్లాన్ చేస్తున్నారు . ఆగ‌స్ట్ 10 లేదా 11 హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు అమిత్ షా. 12న స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ముగీయనున్న నేప‌థ్యంలో ఆయ‌న హైద‌రాబాద్ చేరుకుని ఇక్క‌డే క్రియాశీల స‌భ్య‌త్వం తీసుకుంటార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అమిత్ షా ఇక్క‌డే క్రియాశీల స‌భ్య‌త్వం తీసుకుంటే పార్టీకి మ‌రింత భ‌లం చేకూరిన‌ట్టే అంటున్నారు. జాతీయ అధ్య‌క్షుడు , కేంధ్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న ఆయ‌న రాష్ట్రంలో స‌భ్యత్వం తీసుకోవ‌డం ద్వారా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్టే . గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న బీజేపీలోకి భారీగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. గ్ర‌మీణ స్థాయిలో సైతం రోజుకు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌కర్త‌లు పార్టీలో చేరుతుండ‌టంతో ఆ పార్టీ నేత‌లు ఉత్స‌హంగా ఉన్నారు... అంతే కాకుండా రాష్ట్రంలో పార్టీలో చేరాల‌నుకుంటున్న నేత‌లు ఢిల్లీ వెళ్ళి అదిష్టానంతో క‌ల‌వాల్సి వ‌స్తోంది. ఇంది కొంత ఇబ్బంది క‌రంగా మారింది నేత‌ల‌కు . అయితే అమిత్ షానే తెలంగాణ‌కు వ‌స్తే క‌చ్చితంగా వ‌ల‌స‌లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. క్రియ శీల స‌భ్యత్వం తీసుకుంటే గ‌తంలో కంటే ఎక్క‌వ స‌మ‌యం ఇక్క‌డ కేటాయించే అవ‌కాశం ఉంటుంది.. ఇదే జ‌రిగితే రాష్ట్ర స్థాయి జిల్లా , మండ‌ల స్థాయి నేత‌లు సైతం యాక్టీవ్ గా ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఎన్నికల‌కు నాలుగున్న‌రేళ్ల స‌మ‌యం ఉండ‌టం .. టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా ప‌నిచేయాలంటూ దిషా నిర్దేశం చేయ‌డంతో పాటు ఏకంగా ఆయ‌నే రాష్ట్రంలో క్రియాశీల స‌భ్యుడిగా మారితే అటు కార్య‌క‌ర్త‌లు ఇటు నేత‌ల్లో మ‌రింత జోష్ పెర‌గ‌డం ఖాయం.

పార్టి నేత‌లు లెక్క‌లేసుకుంటున్నారు. స‌భ్యత్వ న‌మోదును ప‌ర్యావేక్షించేందుకు వ‌ర్క్ షాప్ ల ఏర్పాటు తో పాటు నియోజ‌క వ‌ర్గాల వారిగా క‌మిటీలు వేసుకుని మ‌రీ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇక స‌భ్య‌త్వం కోసం ప్ర‌త్యేకంగా యాప్ ను రూపొందించిన బీజేపీ క్రియ‌శీల స‌భ్యత్వం ఉన్న‌వారు ఈ యాప్ ద్వారా న‌మోదు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇక వ‌చ్చే నెల 11న స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం ముగీయ నుండ‌టంతో ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత స్పీడ‌ప్ చేయాల‌ని నిర్ణ‌యించింది.

Tags

Read MoreRead Less
Next Story