ఆ ప్రేమకు ఆయన అర్హత కలిగినవారే
వయసు పెరుగుతున్న వన్నే తగ్గని నటి ఐశ్వర్యారాయ్. ఆమెకు ఇప్పటికి అభిమానుల్లో క్రేజి తగ్గలేదు. ఏ కార్యక్రమంలో కనిపించిన వేలాది మంది ప్యాన్స్ ఆమెను చూడడానికి ఎగబడుతూనే ఉంటారు. తాజాగా ఐశ్వర్య చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను నటిస్తున్న సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో ప్రస్తుతం ఆమె నటిస్తున్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆమె.. హీరో అజిత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. "అజిత్ నటన అద్భుతంగా ఉంటుంది. సినిమా విజయానికి ఆయన పడే కఠోర శ్రమనే కారణం. అజిత్‌పై అభిమానులు చూపే ప్రేమే చెబుతుంది అతనెంటో. వారి ప్రేమకు అజిత్ అర్హత కలిగిన నటుడే. గతంలో ‘కండుకొండేన్ కండుకొండేన్’ సినిమాలో అజిత్‌తో కలిసి నటించా. ఆ సినిమాలో మా ఇద్దరి మధ్య ఎక్కువ సన్నివేశాలు లేకపోయినప్పటికీ సెట్‌లో మాత్రం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చాలా రోజులుగా ఆజిత్ మాట్లాడే అవకాశం రాలేదని" తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com