రోహిత్‌ను చూసి రితిక కూడా అదే చేసింది

రోహిత్‌ను చూసి రితిక కూడా అదే చేసింది

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్‌మెన్, వైస్‌ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మను అన్‌ఫాలో చేశాడు. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్‌ జరుగుతున్నప్పుడే కెప్టెన్ కోహ్లీని కూడా అన్‌ఫాలో అయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితిక కూడా సేమ్‌ ఇదే ఫాలో అయింది. ఉన్నట్టుండి రోహిత్ శర్మకు ... కోహ్లీ, అనుష్కశర్మపై ఎందుకు కోపం వచ్చింది. ఇద్దరినీ ఎందుకు అన్‌ఫాలో చేశాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామాలూగా అయితే ఇది పర్సనల్ విషయం. పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ దీనివెనుక చాలా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్ జరుగుతున్నప్పుడే ఈ స్టోరీకి బీజం పడింది..

వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా ప్రస్థానం సెమీస్‌ దగ్గరే ఆగిపోయింది. ఆ మ్యాచ్‌ ముగిసిన వారానికి కానీ.. జట్టు సభ్యులు స్వదేశానికి రాలేదు. కానీ వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం మ్యాచ్‌ ముగిసిన రెండు రోజులకే ముంబయిలో వాలిపోయాడు. అంత అత్యవసరంగా సొంత ఖర్చులతో ఒక్కడే స్వదేశానికి వచ్చేయడానికి కారణమేంటో అర్థం కాలేదు! కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో, రోహిత్‌కు విభేదాలన్న చర్చ అప్పుడే మొదలైంది . రోజు రోజుకూ ఈ చర్చ విస్తృతమై.. ఇప్పుడు పీక్‌స్టేజ్‌కి చేరింది.

ప్రపంచకప్‌ జరుగుతున్నప్పుడే కోహ్లిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యాడు రోహిత్‌. ఆ సంగతి అప్పుడెవరూ గుర్తించలేదు. సెమీస్‌లో దారుణమైన ఓటమి తర్వాత ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. జట్టు ఎంపిక, కూర్పు విషయంలో కోచ్‌ రవిశాస్త్రితో కలిసి కోహ్లి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, వైస్‌కెప్టెన్‌ అయిన తనను అసలు పరిగణనలోకే తీసుకోకపోవడంపై రోహిత్‌ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లి, శాస్త్రి నిర్ణయాలు జట్టును దెబ్బ తీశాయని, వారి వల్లే టీమ్‌ఇండియా సెమీస్‌లో నిష్క్రమించిందనే అభిప్రాయంతో ఉన్నాడు రోహిత్. సగం జట్టు సభ్యుల కూడా అతడికి మద్దతు పలికారని సమాచారం.

ముఖ్యంగా అంబటి రాయుడిని పక్కన పెట్టడం, విజయ్‌ శంకర్‌ను జట్టులోకి ఎంపిక చేయడంపై రోహిత్‌ ముందు నుంచి వ్యతిరేకతతో ఉన్నాడట. షమి, జడేజా లాంటి వాళ్లకు పెద్దగా అవకాశాలివ్వకుండా భువనేశ్వర్‌, చాహల్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.. తుది జట్టు ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. ఇక సెమీఫైనల్లో వరుసగా వికెట్లు పడుతున్నపుడు ధోనీని ముందు పంపకుండా ఏడో స్థానంలో దించడంపై బహిరంగంగానే రోహిత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు జట్టు వర్గాలు చెబుతున్నాయి.

ఇండియా వరల్డ్ కప్ గెలిచుంటే ఇవేవీ బయటకు వచ్చేవి కావు..కానీ కేవలం సెలక్షన్‌, జట్టు కూర్పులో తప్పిదాల వల్లే ఘోరపరాజయం ఎదురైందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తుండటంతో కోహ్లి-రోహిత్‌ వివాదానికి బాగా హైప్‌ దక్కుతోంది. అయితే ఇదంతా మామూలు అంశమే అని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది బీసీసీఐ. ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు ఉండటం సహజమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి త్వరలో ప్రారంభం కాబోయే వెస్టిండీస్ టూర్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ ఎలా ఉంటారు? జట్టుని ఎలా నడిపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story