పెద్దమ్మ ఇంటికే కన్నం వేసిన యువతి

పెద్దమ్మ ఇంటికే కన్నం వేసిన యువతి

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఓ యువతి తన పెద్దమ్మ ఇంటికే కన్నం వేసింది. స్నేహితుల సాయంతో ఇంట్లో ఉన్న బంగారం, నగదు చోరీ చేసేలా ప్రణాళిక రచించింది. నిమ్మరసంలో నిద్రమాత్రలు వేసి పెద్దమ్మకు ఇవ్వడంతో ఆమె ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో బాధితురాలికి సేవ చేస్తున్నట్లు నటించి ఇంటి తాళం చెవిని స్నేహితులకు అందజేసింది. దీంతో వారు ఆ యువతి పెద్దమ్మ ఇంటికి వెళ్లి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు వివరాలను సీపీ అంజనీకుమార్‌ వివరించారు. నిందితుల నుంచి 24లక్షల విలువ చేసే 54తులాల బంగారాన్ని, 5లక్షల 25వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

రాంనగర్ గుండులో నివాసం ఉండే పిల్ల వినయ కుమారి టెలిఫోన్ ఆపరేటర్ గా తెలంగాణ పోలీస్ అకాడమీ లో పని చేస్తుంది.ఈమె బంధువైన కుష్బూ బేగంపేట్ లో నివాసం ఉంటుంది. కుష్బూ తండ్రికి 2018లో హార్ట్ ఆపరేషన్ అయ్యింది. తమ్ముడు పక్షవాతంతో మంచన పడ్డాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమె దగ్గరి బంధువైన పిల్ల వినయకుమారి ఇంట్లో చోరీ చేయ్యాలని డిసైడ్ అయ్యింది. తన ఫ్రెండ్ అయిన సుమల వంశీకృష్ట, సూర్య కు చోరీ ఫ్లాన్ గురించి చెప్పి స్కెచ్ వేసింది. వినయకుమారి కూతురి తో ఇంట్లోకి వెళ్లిన కుష్బూ బీరువా తాళలను డూప్లీకేట్ చేయించి తన ఫ్రెండ్స్ కి ఇచ్చింది. తను ఇంట్లోకి వెళ్లి నిమ్మకాయల రసం లో స్లీపింగ్ టాబ్లేట్స్ వేసి వినయకుమారికి ఇచ్చింది. ఆమె గాఢ నిద్రలోకి చేరుకున్నాక.. ఎవరికి అనుమానం రాకుండా తన కూతురితో కలిసి ముషీరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో ఆడ్మీట్ చేసింది. ఈనెల 19నా రాత్రి కుష్బూ వారి స్నేహితులతో కలిసి డూప్లీకేట్ తాళంతో ఇంట్లో ఉన్న సోమ్మును, బంగారాన్ని చోరీ చేశారు.

మూడు రోజుల తరువాత వినయ కుమారి కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న నగదు,బంగారం చోరీకి గురైందని గుర్తించి ఈనెల23 నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫిర్యాదు దారుల కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా 48 గంటలోనే కేసును చేధించారు. ఫిర్యాదుదారుల బంధువులు అయిన ముగ్గురిని బేగంపేట్ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 54 తులాల బంగారం తో పాటు ఐదున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story