మాట తప్పడం, మడమ తిప్పడం దిన చర్యగా మారింది : తులసిరెడ్డి

మాట తప్పడం, మడమ తిప్పడం దిన చర్యగా మారింది : తులసిరెడ్డి
X

వైసీపీ ప్రభుత్వానికి మాట తప్పడం , మడమ తిప్పడం దిన చర్యగా మారిందని విమర్శించారు పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. రైతులకు పెట్టుబడి సాయం కింద 12వేల 500 ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన సీఎం జగన్‌ .. ఇప్పుడు 6వేల 500 మాత్రమే ఇస్తాం.. మిగతా 6వేలు కేంద్రం ఇస్తుందని చెప్పడం దారుణమన్నారు. మద్యపాన నిషేధం మూడు దశల్లో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మధ్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పేదలందరికీ 45 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు తులసిరెడ్డి.

Tags

Next Story