మోసపోయా.. న్యాయం చేయండి సార్

మోసపోయా.. న్యాయం చేయండి సార్

ప్రేమ పేరుతో మోసపోయాను సర్ న్యాయం చేయండంటూ ఓ యువతి కేటీఆర్‌ దగ్గర కనీళ్లు పెట్టుకుంది. తనను కొనాళ్ళ పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటనాని చేప్పి ఇప్పుడు మొహం చాటేశాడని కేటీఆర్‌కు వివరించింది. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్‌ అనే యువకుడు తనని ప్రేమించి మోసం చేశడాని వాపోయింది. 20 రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఒప్పుకొని ఏడాది గడుస్తున్న ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదాని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ యువతి ఆవేధనను విన్న కేటీఆర్ ఆ అమ్మాయి సమస్య పరిష్కారానికి సహకరించాలని తెరాస మహిళా విభాగానికి చెప్పారు.

వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన యువతి.. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని ఆమెకు అశోక్ మాటిచ్చాడు. ఆ తర్వాత వివాహానికి నిరాకరించడంతో ఆమె కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ యువకున్ని పిలిచి

విచారించారు. ఆ తరువాత 20రోజుల్లో ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని అతడు పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నాడు. ఈ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా పెళ్లి చేసుకోవడం లేదని ఆమె తెలంగాణ భవన్‌ వద్దకు వచ్చి బోరున విలపించింది,

Tags

Read MoreRead Less
Next Story