'టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' అధ్యక్షుడిగా నారాయణదాస్ ఏకగ్రీవ ఎన్నిక

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నారాయణదాస్ ఏకగ్రీవ ఎన్నిక

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నారాయణదాస్ కె నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ దఫా జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి బరిలోకి దిగిన ఏసియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఫైనాన్సియర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 600కు పైగా సినిమాలకు ఫైనాన్సర్ గా ఉన్నారు. అంతేకాదు వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సినిమాస్ ను నడిపిస్తూ.. చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఇప్పటి వరకూ ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో దూసుకుపోతోన్న ఏసియన్ సినిమాస్ ఇటీవల నిర్మాణ రంగంలో సైతం అడుగుపెట్టింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రంతో ఏసియన్ సినిమాస్ చిత్ర నిర్మాణం మొదలుపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story