ఆంధ్రప్రదేశ్

టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు

టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు
X

గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పొనుగుపాటులో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రోడ్డును నిర్మించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోడ నిర్మాణాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికివెళ్లింది. అయితే గ్రామ శివార్లలోనే కమిటీని పోలీసులు అడ్డుకున్నారు.

కమిటీ సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాలి గిరి, తెనాలి శ్రావణ్‌కుమార్‌, అశోక్‌బాబుతోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులును అరెస్టు చేశారు. టీడీపీ నేతల్ని నరసరావుపేటకు తరలించారు. అటు.. పొనుగుపాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. నరసరావుపేట వెళ్లాక RDOతో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సమావేశం అయింది. త్వరలో గ్రామంలో విచారించి నిర్ణయం తీసుకుంటామన్నారు RDO.

Next Story

RELATED STORIES