ఆంధ్రప్రదేశ్

అమ్మ ఒడికి చేరిన రాజేష్

ఏలూరులో ఇటీవల దొరికిన రాజేష్ ఎట్టకేలకు అమ్మ ఒడికి చేరాడు. బాబు తల్లిని తానే అంటూ వచ్చిన సుష్మ ప్రశ్నించారు పోలీసులు. బాబు తల్లి సుష్మ అని నిర్ధారణకు రావటంతో రాజేష్ ను ఆమెకు అప్పగించారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత వారం ఇంటర్వ్యూకు వెళ్తు బాబును స్నేహితురాలికి ఇచ్చి వెళ్లానని సుష్మ చెబుతోంది. అయితే.. ఆమె బాబుని పట్టించుకోకుండా వెళ్లిపోయిందని అంటోంది. బాబును రక్షించి.. శిశు సంరక్షణ గృహానికి పంపించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. మీడియాలో బాబును చూసి గుర్తుపట్టి వచ్చానని సుష్మ వివరించింది.

Next Story

RELATED STORIES