శంషాబాద్‌లో మొదలైన హజ్‌ యాత్ర సందడి

శంషాబాద్‌లో మొదలైన హజ్‌ యాత్ర సందడి

జీవితంలో ఒక్కసారైనా పవిత్ర మక్కా సందర్శించాలని ముస్లింగా పుట్టిన ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అంతటి ప్రాముఖ్యమున్న హజ్‌ యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జెండా ఊపి హజ్‌ యాత్ర ప్రారంభించారు. ఈ ఏడాది కనీసం 10 వేల మందికిపైగా యాత్రికులను తరలించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హజ్‌ యాత్ర ప్రారంభం కావడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో సందడి నెలకొంది.

హాజ్‌ యాత్రకు రాయితీ కల్పిస్తుండటంతో ఏటా హజ్‌కు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. హజ్‌కు వెళుతున్న ఆప్తులకు సెండాఫ్‌ ఇవ్వటానికి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జనం ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కడుతున్నారు. మరోవారం రోజులపాటు హజ్‌ యాత్రికుల తరలింపు కొనసాగుతుందని మహమూద్‌ అలీ తెలిపారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story