గొలుసు దొంగతనం కేసు.. 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

గొలుసు దొంగతనం కేసు.. 12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

శనివారం అంబర్‌పేట డీడీ కాలనీలో జరిగిన గొలుసు దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. కాచిగూడ రైల్వేస్టేషన్ దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి నాలుగు తులాల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల్లో కేసును ఛేదించారు పోలీసులు.

ఈ కేసులో సీసీ ఫుటేజ్‌ కీలకంగా మారిందని.. పట్టుబడిన వాళ్లంతా యువకులే అని తెలిపారు సీపీ అంజనీకుమార్‌. కష్టపడి పని చేస్తే మంచిగా బతకొచ్చని.. అలా కాకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాలకు పాల్పడితే.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు సీపీ అంజనీ కుమార్‌.

Tags

Read MoreRead Less
Next Story