పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి : ఎంపీ కోమటిరెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి : ఎంపీ కోమటిరెడ్డి

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు నెక్లెస్ రోడ్డులో నిర్వహించనున్నారు. పీవీఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు జైపాల్ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీభవన్ కు ఆయన పార్ధీవ దేహం చేరుకుంటుంది. పార్టీ నేతలు కార్యకర్తలు, అభిమానుల ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం గాంధీభనవ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు తరలిస్తారు. పీవీఘాట్ పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో కొందరు అమెరికాలో ఉంటున్నారు. జైపాల్ రెడ్డి మృతి వార్తతో ఆయన మనుమళ్లు ప్రస్తుతం ఆమెరికా నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది.

ఉత్తమ రాజకీయ నాయకుడిగా, స్పోక్స్ పర్సన్ గా పేరున్న జైపాల్ రెడ్డికి పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. రాజకీయాలలో చెరగని ముద్ర వేశారంటూ ఆయన ఔన్నత్యాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు లీడర్లు.. జైపాల్‌రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరున్న జైపాల్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం స్థూపం ఏర్పాటు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలన్నారు.

Tags

Next Story