అంతర్జాతీయం

ట్రంప్ పాలనపై మొదటిసారిగా స్పందించిన ఒబామా

ట్రంప్ పాలనపై మొదటిసారిగా స్పందించిన ఒబామా
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారిగా స్పందించారు. ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యల్నివ్యతిరేకిస్తూ ఆఫ్రికన్ అమెరికన్లు వాషింగ్టన్ పోస్టులో ఓ కథనం రాశారు. దీనిపై ఒబామా స్పందిస్తూ వారికి మద్దతుపలికారు ఒబామా. తన పాలనలో ఈ బృందం సభ్యులు సాధించిన విజయాలు, కృషికి తాను ఎప్పటికి గర్విస్తానంటు మెచ్చుకున్నారు. వారు అమెరికా సంక్షేమం కోసం చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ ట్విట్ చేశారు. మేం ఆఫ్రికన్ అమెరికన్ వాసులం, దేశభక్తులం, చేతగానివారిలా కూర్చోవడం నిరసిస్తాం' అంటూ ఒబామా పాలకవర్గంలోని 148మంది సభ్యులు ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ వ్యాసం ప్రచురించారు. ట్రంప్ ఇటీవల డెమోక్రటిక్ పార్టీ సభ్యులను దేశం విడిచి వెళ్లిపోవాలన్న విషయం తెలిసిందే.

Next Story

RELATED STORIES