జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ జైపాల్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి దేశానికి చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడుతూ ట్వీట్ చేశారు సీఎం కేసీఆర్. జైపాల్ రెడ్డి పార్ధీవ దేహం దగ్గర నివాళులు అర్పించారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. గొప్ప పార్లమెంటేరియన్ ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.

జైపాల్ మృతి తెలంగాణకు కాంగ్రెస్ తీరని లోటు అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ ముద్దుబిడ్డ.. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన గొప్ప నేత జైపాల్ రెడ్డి అని ప్రశంసించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

కేంద్రమాజీ మంత్రి చిదంబరం జైపాల్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడే ప్రతి మాట, రాసే ప్రతి పదం గొప్ప అర్ధాన్ని ఇచ్చేలా..చెరిపివేయలేనంతగా ముద్ర వేస్తాయన్నారు. పాతతరం విలువలు, నేటి తరం టెక్నాలజీ కలబోసిన ప్రతిభావంతుడిగా జైపాల్ రెడ్డి అభివర్ణించారు చిదంబరం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైపాల్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు అని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. రాజకీయాల్లో ఆయనలాంటి నేతలు అరుదుగా కనిపిస్తారని, అలాంటి వ్యక్తిని కొల్పోవటం ఎంతో బాధకరమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Tags

Next Story