సంచలన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి మహమూద్ ఆలీ

తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం నవాబుల తరువాత రాష్ట్రంలో ముస్లింలు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది సీఎం కేసీఆరేనని అన్నారు. తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 10 వేల మంది ముస్లింలను హజ్ యాత్రకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామని హోంమంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాదాపు 800 మంది ముస్లిం సోదరులు రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో.. హజ్ యాత్రకు బయలుదేరిన తొలి విమానానికి హోంమంత్రి మహమూద్ ఆలీ జెండా ఊపి ప్రారంభించారు.
250 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని యాదవ- కుర్మ భవనాలకు ప్రభుత్వం కేటాయించినందుకు... గొల్లకుర్మలు కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని.. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగర శివారు గండిపేట మండలం కోకాపేటలో గతంలో కేటాయించిన 10 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన గొల్ల కురుమల భవన నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమిపూజ చేశారు.. ఈ భవనాలు పూర్తయితే... గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నగరంలో విద్యనభ్యసించేందుకు వసతి గృహాలుగా ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తలసాని అన్నారు.
హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది వంద కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు అటవీశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గతంలో 35 శాతమున్న అడవులు ప్రస్తుతం 24 శాతానికి తగ్గాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,ఎర్రబెల్లితో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక డిగ్రీ కాలేజీలో నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ నాటిన మొక్కను మంత్రి పరిశీలించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖ రాశారు. ఫొని తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా అల్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు సహాయక బృందాలను పంపినందుకు లేఖ ద్వారా కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

