టిక్ టాక్ చేసిన రెవెన్యూ ఉద్యోగి సస్పెండ్

టిక్ టాక్ చేసిన రెవెన్యూ ఉద్యోగి సస్పెండ్

టిక్‌ టాక్‌ ప్రభుత్వ అధికారుల కొంప ముంచుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పక్కన పెట్టి మరీ టిక్‌టాక్‌లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఉద్యోగులు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాగే టిక్‌టాక్‌ చేసి రెవెన్యూ ఉద్యోగి సస్పెండ్‌ అయ్యాడు. మహబూబాబాద్‌ జిల్లా జంగిలిగొండ వీఆర్‌ఏ విద్యాసాగర్‌ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో టిక్‌టాక్‌ వీడియోలు చిత్రీకరించాడు. బాధితుల గోడు పట్టించుకోకుండా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేశాడు. వీఆర్‌ఏ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే సదరు వీఆర్‌ఏపై చర్యలు తీసుకున్నారు తహసీల్దార్‌ రంజిత్‌.

Tags

Read MoreRead Less
Next Story