ఆంధ్రప్రదేశ్

అధికారంలోకి వచ్చినా ‘ఫేక్‌’ బతుకు మారలేదు : నారా లోకేష్‌

అధికారంలోకి వచ్చినా ‘ఫేక్‌’ బతుకు మారలేదు : నారా లోకేష్‌
X

జగన్‌ సర్కారుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారంటూ ట్విటర్‌ ద్వారా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ‘ఫేక్‌’ బతుకు మారలేదని.. అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతీయడానికి అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు...

తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎదిగిన చరిత్ర వైసీపీ నాయకుడిదంటూ పరోక్షంగా సీఎం జగన్‌నుద్దేశించి విమర్శలు చేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏరోజూ అటువైపు చూడకుండా స్వచ్ఛమైన మనసు, నీతి, నిజాయతీతో నందమూరి బాలకృష్ణ ఎదిగారన్నారు . అలాంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు లోకేష్‌. నిరూపించలేకపోతే రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారాయన...

మరోవైపు... స్టిక్కర్‌ ముఖ్యమంత్రి అంటూ... జగన్మోహన్‌రెడ్డిని సంబోధించారు లోకేష్‌. స్టిక్కర్‌ ముఖ్యమంత్రి గారి బృందం వారి మాటలు నిజంగా ఓ పెద్ద కామిడీలో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. తన ట్విట్టర్‌లో. పొలిటికల్‌ కామిడీ వీడియోను పోస్ట్‌ చేశారు లోకేష్‌.. మొత్తానికి లోకేష్‌..... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... తన పదునైనా బాణాల్లాంటి ట్వీట్లతో... జగన్‌ సర్కారును విమర్శిస్తున్నారు లోకేష్‌.

Next Story

RELATED STORIES