మామ్మూళ్లు ఇవ్వాలంటూ హోటల్‌ సిబ్బందిపై రౌడీషీటర్‌ దాడి

మామ్మూళ్లు ఇవ్వాలంటూ హోటల్‌ సిబ్బందిపై రౌడీషీటర్‌ దాడి

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో ఓ రౌడీషీటర్‌ హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో ఓ హోటల్‌లో వీరంగం సృష్టించాడు. తనకు మామ్మూళ్లు ఇవ్వాలంటూ సిబ్బందిపై మద్యం బాటిల్‌తో దాడి చేశాడు. రౌడీషీటర్‌ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి దాటక ఈ ఘటన చోటు చేసుకుంది

ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఇదే అదనుగా రౌడీషీటర్‌ తమపై దాడికి దిగాడని హోటల్‌ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అర్థరాత్రి దాటాక కూడా హోటల్స్‌కు పోలీసులు ఎందుకు పర్మిషన్‌ ఇస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story