కెజిఎఫ్ 2 లో బాలీవుడ్ హీరో.. ఫస్ట్ లుక్ అదుర్స్

కెజిఎఫ్ 2 లో బాలీవుడ్ హీరో.. ఫస్ట్ లుక్ అదుర్స్

లాస్ట్ ఇయర్ కన్నడ నుంచి వచ్చిన కె.జి.ఎఫ్ చిత్రం దక్షిణాది ప్రేక్షకులను కాదు, బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి 250 కోట్లు కొల్లగొట్టిన కె.జి.ఎఫ్ మూవీకి, ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పార్ట్ 2లో స్టార్ కాస్టింగ్ కూడా ఉండబోతుంది. అందులో భాగంగా బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ స్టార్ ని, మెయిన్ విలన్ గా తీసుకున్నారు కె.జి.ఎఫ్ మేకర్స్.

బాహుబలి సిరీస్ తర్వాత టోటల్ నేషనల్ వైడ్ గా క్రేజ్ ని, సక్సెస్ ని సాధించిన సౌత్ సినిమా KGF. తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీసే కన్నడ పరిశ్రమలో KGF అత్యంత ఎక్కువ బడ్దెట్ తో తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్, ఎవరూ ఊహించలేని బజ్ తో, అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఓ కన్నడ సినిమా వంద కోట్లు సాధించడమే ఎక్కువనుకుంటే, ఏకంగా 250 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. అందులో హిందీ వెర్షన్ నుంచి 50 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం హైలైట్. కన్నడ వెర్షన్ కి 125 కోట్లు వరకు వస్తే.. మిగతావి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్ నుంచి వచ్చాయి.

KGFకి సీక్వెల్ గా KGF చాప్టర్ 2 పేరుతో త్వరలోనే మరో సినిమా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో హైలైట్ గా నిలిచిన మాస్ ఎలిమెంట్స్ ని, సెకండ్ పార్ట్ లో మరింత ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. యష్ ఈ సినిమా కోసం మరింతగా కష్ట పడుతున్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ సక్సెస్ ని బట్టీ, ఈ సారి దానికి రెట్టింపు ఉండేలా స్టార్ కాస్ట్ ని తీసుకుంటున్నారు. స్టోరీ ప్రకారం గరుడ బాబాయి అధీరానే సెకండ్ పార్ట్ లో విలన్. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని తీసుకున్నారు. సోమవారం సంజయ్ దత్ పుట్టినరోజు. అందుకే తన లుక్ తో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సంజయ్ దత్ వల్ల బాలీవుడ్లో సినిమాపై మరింత అంచనాలు పెరగడం ఖాయం అని చెప్పాలి. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రాబోతున్న KGF పార్ట్ 2, ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story