ఆడపిల్ల పుట్టింది.. పేరు సెలెక్ట్ చేయరూ: ఉపాసన

ఆడపిల్ల పుట్టింది.. పేరు సెలెక్ట్ చేయరూ: ఉపాసన

మా ఇంట్లో ఓ ఆడపిల్ల పుట్టింది. దాన్ని చూసి మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మా బుజ్జి గుర్రం పిల్ల ఎంత అందంగా ఉందో.. మరి అంత అందమైన బుల్లి పిల్లకి అంతకంటే అందమైన పేరు ఉండాలి కదా.. అందుకే మీరే ఓ మంచి పేరు సెలక్ట్ చేయండి అంటూ ట్విట్టర్‌లో ఫోటోలతో సహా పోస్ట్ చేసింది ఉపాసన. దీంతో నెటిజన్స్ కూడా అంతే ఉత్సాహంగా రకరకాల పేర్లు సజెస్ట్ చేస్తున్నారు. కరుణ్, రామ్, మస్తంగ్, బాద్షా, ద్రోణ, ధ్రువ, చిట్టి, ఉడాన్, చెర్రీ, రీనా, గ్రేసీ, హార్వీ, బంగారం, సనా, మిస్సీ ఇలా బోలెడు పేర్లు సూచిస్తున్నారు అభిమానులు. రామ్ చరణ్‌కి జంతువులంటే చాలా ఇష్టం. ఇక ఉపాసన గతంలో రాజస్థాన్‌లో సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్ పేరుతో పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించింది. ఇటీవల రామ్ చరణ్, ఉపాసనలు దక్షిణాఫ్రికాలో వైల్డ్ లైఫ్ సఫారీ చేసి అక్కడి జంతువులను మచ్చిక చేసుకుని ఎంజయ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story