విషగ్రాసం తిని 25 ఆవులు మృతి.. 200 ఆవులకు అస్వస్థత

విషగ్రాసం తిని 25 ఆవులు మృతి.. 200 ఆవులకు అస్వస్థత
X

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేములలో విషాదం చోటుచేసుకుంది. విషగ్రాసం తిని 25 ఆవులు మృతి చెందాయి. మరో 200 ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. శ్రీను అనే రైతుకు మూడు వందల ఆవులు ఉండగా కృష్ణా నదీ తీరంలో మేతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషగ్రాసం తిన్న ఆవుల్లో 25 స్పాట్‌లోనే చనిపోయాయి. ఎవరో కావాలనే విషం కలిపి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

Tags

Next Story