ఫేక్ విజిలెన్స్ ఆఫీసర్ టోకరా

నల్గొండ జిల్లాలో ఫేక్ విజిలెన్స్ ఆఫీసర్ టోకరా వేశాడు. దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో ఓ ఎరువుల దుకాణానికి వచ్చిన వ్యక్తి విజిలెన్స్ అధికారినంటూ యజమానిని భయపెట్టాడు. రికార్డులు చూపించాలని డిమాండ్ చేశాడు. అనంతరం 80వేల నగదు, మూడు ఉంగరాలు లాక్కొని కారులో ఉడాయించాడు. తేరుకున్న బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఎరువుల దుకాణంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే.. హయత్‌నగర్‌లో విద్యార్ధిని సోనిని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం అతని ముఖ కవలికలు ఉండటంతో పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. విజిలెన్స్ అధికారినంటూ వచ్చిన వ్యక్తి కారులో గుంటూరు వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజాల వద్ద సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com