ఆమెని తిరుపతి తీసుకెళ్లి...

ఆమెని తిరుపతి తీసుకెళ్లి...

బీఫార్మసీ విద్యార్థిని సోనీని అపహరణ చేసిన రవిశేఖర్‌ పోలీసులకు పట్టుబడ్డట్టు తెలుస్తోంది.. అద్దంకిలో సోనీని వదిలేసిన రవిశేఖర్‌.. అక్కడి నుంచి మరో చోటుకు పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయినట్లు సమాచారం .. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.. వారం రోజుల క్రితం హయత్‌నగర్‌లో సోనీని అపహరించిన రవిశేఖర్‌ అక్కడ్నుంచి కడప జిల్లా ఒంటిమిట్ట తీసుకెళ్లాడు.. ఆ తర్వాత తిరుపతి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.. అక్కడ్నుంచి ఆమెను అద్దంకి తీసుకెళ్లాడు రవిశేఖర్‌.. ఆతర్వాత ఆమెను హైదరాబాద్‌ బస్సెక్కించి వెళ్లిపోయాడు.. ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన తర్వాత ఎటు వెళ్లాలో అర్థం కాని సోనీ.. తెల్లవారుజామున 5 గంటల వరకు అక్కడే ఉంది.. ఆ తర్వాత మరో యువతి సాయంతో తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది.. ఆ తర్వాతే పోలీసులకు సమాచారం తెలిసింది.. ఇక యువతిని వదలిపెట్టి వెళ్లిన తర్వాత ఒంగోలులో రవిశేఖర్‌ను పట్టుకున్నారు పోలీసులు..

సోనీ ప్రస్తుతం సరూర్‌నగర్‌ పోలీసుల సంరక్షణలో ఉంది.. సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో సోని, ఆమె తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సమక్షంలో పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నారు.. మరోవైపు ఎంజీబీఎస్‌లో సోనీని చూసిన మరో యువతి ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పింది.

ఇక కిడ్నాపర్‌ రవిశేఖర్‌ నేర చరిత్రపైనా మూడు రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు.. గతంలో 25 కేసులు రవిపై ఉన్నట్లు గుర్తించారు..కంకిపాడు, పెనమలూరు, రాజమండ్రితోపాటు సీతానగరంలో మహిళలను ట్రాప్‌ చేసినట్లు నిర్ధారించారు.. డబ్బు ఆశ చూపి యువతులను తీసుకేళ్ళేవాడని విచారణలో తేలింది.. కర్నాటకలోని బళ్లారిలో కారు దొంగిలించి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ఏపీ పోలీసులు రవిశేఖర్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారించనున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story