ఆ రైతుకు మరో సాయం

ఆ రైతుకు మరో సాయం

రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తించి అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఇటీవల కరెంట్ షాక్‌తో పాడి ఆవులను కోల్పోయిన సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలం గొల్లకుంట గ్రామానికి చెందిన రైతు సమ్మయ్యకు అర్చకులు రంగరాజన్‌ గోవును దానంగా ఇచ్చారు. రైతు కుటుంబం జీవనోపాధి కోసం ఆవుతో పాటు దూడను చిలుకూరు బాలాజీ దేవాలయంలోని గోశాలలో రైతుకు దానం ఇచ్చారు.

మానవసేవే మాధవ సేవగా అందరిని ఆదుకుంటు ఆదర్శంగా నిలుస్తూ చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో ఆయన ముందుకు సాగుతున్నారు. వారం కిందట సిద్దిపేట జిల్లా రైతు సమ్మయ్యకి ఉన్న రెండు ఆవులు కరెంట్ షాక్ తగిలి మరణించాయి. విషయం తెలిసిన వెంటనే అతడికి ఫోన్ చేసి ఓదార్చారు. అప్పుడే అవును ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అవును, దూడను ఇచ్చి బాగా చూసుకోమని చెప్పరు.

తన వేదనను ప్రజాప్రతినిధులు ఎవ్వరు పట్టించుకోకపోయినా.. చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు పట్టించుకున్నారని రైతు సమ్మయ్య.. ఆయనకు ధన్యవాదాలు చెప్పాడు. ఇంత సాయం చేసిన అర్చకులకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు రైతు సమ్మయ్య . అయితే ఇంతకుముందు ఓ ప్రవాసీయుడు సమ్మయ్యకు సాయం అందించాడు. సొంత డబ్బు రూ.లక్ష వెచ్చించి.. రెండు పాడి ఆవులను కొని ఆ రైతుకు ఉచితంగా ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story