రోహిత్‌ శర్మతో విభేదాలు లేవు - కోహ్లీ

రోహిత్‌ శర్మతో విభేదాలు లేవు - కోహ్లీ

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మతో తనకు విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు. అతడిని చూసి అభద్రతాభావానికి గురైతే అది తన ముఖంలో కనిపించేదని వెల్లడించాడు. తానెప్పుడూ రోహిత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతానని పేర్కొన్నాడు. రోహిత్‌ అంత బాగా ఆడతాడని తెలిపాడు.

అసలు బయట ఇలా ఎందుకు ప్రచారం జరుగుతుందో అర్థం కావడం లేదన్నాడు కోహ్లీ. ఈ అబద్ధాలను ఎవరు కల్పిస్తున్నారో తెలియడం లేదని చెప్పాడు. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చాడు. అసలు లేని వివాదం గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పాడు. టీమిండియాను అత్యుత్తమ స్థానంలో ఉంచేందుకు ఎంతో కష్టపడ్డామన్నారు విరాట్. విభేదాల కథనాలు గందరగోళంగా ఉన్నాయని.. వాటిని చదవాల్సి రావడం ఘోరమని చెప్పాడు. డ్రస్సింగ్‌ రూమ్‌ గురించి అబద్ధాలు, ఊహాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బయట నుంచి వీటిని సృష్టిస్తున్నారు.. టెస్టుల్లో తాము ఏడో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకున్నామని.. ఆటగాళ్ల మధ్య సుహృద్భావం లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story