బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై సునీల్‌ గవాస్కర్‌ ఆగ్ర‌హం

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై సునీల్‌ గవాస్కర్‌ ఆగ్ర‌హం

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు సమీక్ష చేయకుండానే సారథిగా విరాట్‌ కోహ్లీని తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి. ఈ సెలక్షన్‌ కమిటీకి ఇదే చివరి ఎంపిక అని ఆయన వ్యాఖ్యానించారు. వెస్టిండీస్‌ పర్యటనకు జట్టును ఎంపిక చేసేముందు కనీసం సారథ్యం గురించి సమావేశం నిర్వహించలేదన్నారు.

కోహ్లీని సారథిగా ఎంపిక చేసింది ప్రపంచకప్‌ వరకే అన్నారు సునీల్‌ గావస్కర్‌.. సారథిని తిరిగి ఎంపిక చేసేందుకు సెలక్టర్లు కనీసం ఐదు నిమిషాలైనా కేటాయించలేదు అని విమర్శించారు. వరల్డ్‌కప్‌లో ఆడిన కొంతమంది ఆటగాళ్లను ఏ రకంగా తప్పించారని గవాస్కర్‌ నిలదీశాడు. ఒకవేళ ఆయా ఆటగాళ్ల ప్రదర్శన బాగాలేదని అనుకుంటే, మరి భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించకపోయిన కెప్టెన్‌గా కోహ్లినే కొనసాగించడం తప్పుడు సంకేతాలకు దారి తీయదా అని ప్రశ్నించాడు బీసీసీఐని గవాస్కర్.

Tags

Next Story