చిటికెలు వేస్తూ.. పైకిలే అంటూ.. పాస్టర్ హంగామా

చిటికెలు వేస్తూ.. పైకిలే అంటూ.. పాస్టర్ హంగామా

దెయ్యాలను ఒక్క చిటికెలో వదిలిస్తా అంటున్నాడు ఓ పాస్టర్‌. వరంగల్‌ జిల్లా హన్మకొండ సఖి ఉమెన్ అండ్ గర్ల్ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో అర్థరాత్రి గజ్జెల చప్పుళ్లు వినిపిస్తున్నాయని అక్కడి సబ్బంది కొంతకాలంగా భయ బ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి భయాన్ని ఆసరాగా చేసుకున్న సఖి కౌన్సిలింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు.. పాస్టర్‌ దామోదర్‌ తనకు మంత్రాలు, తంత్రాలు తెలుసంటూ హంగామా చేస్తున్నాడు.

కౌన్నిలింగ్ సెంటర్‌లో దెయ్యాలు ఉన్నాయని.. తాను మంత్రాలు చదివితే పారిపోతాయని నమ్మించాడు. వెంటనే వింత వింత శబ్దాలు చేస్తూ.. పద్యాలు చదువుతూ హంగామాతో దెయ్యాలను వెళ్లగొడుతున్నట్టు నమ్మించాడు. ఓ మహిళ దెయ్యం పట్టినట్టు కింద పడి ఉంటే.. చిటికెలు వేస్తూ.. పైకిలే అంటూ హంగామా చేశాడు. ఆ మహిళ పైకి లేవగానే అంతా ఆశ్చర్యపోయారు.

Tags

Read MoreRead Less
Next Story