సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

విద్యుత్ శాఖకు గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు పెద్దమొత్తంలో బకాయిలు పడటంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలే బిల్లులు చెల్లించకపోవడం దారుణం అన్నారు. ఇకపై ప్రతినెలా తప్పకుండా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు . లేదంటే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్లపై వేటు పడుతుందని హెచ్చరించారు. పాత బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు సీఎం కేసీఆర్..

ప్రగతి భవన్‌లో విద్యుత్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు కేసీఆర్. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని అధికారుల్ని ఆదేశించారు.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందివ్వాలని అన్నారు.. ఎత్తిపోతల పథకాల విద్యుత్ ఖర్చను ప్రభుత్వమే భరిస్తుందన్నారు కేసీఆర్. సోలార్ పవర్ కోసం టెండర్లను పిలవాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే పవర్ వీక్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు సీఎం.విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థికతోడ్పాటు అందించడంతోపాటు.. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో అద్భుతమైన పనితీరుతో దేశానికి ఆదర్శంగా నిలిచిన విద్యుత్ సంస్థలు ... ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు...

Tags

Read MoreRead Less
Next Story