సిద్ధార్థ ఎపిసోడ్ విషాదాంతం.. నేత్రావతి నదిలో..

కాఫీ డే అధినేత సిద్ధార్థ ఎపిసోడ్ విషాదాంతమైంది. నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం బయటపడింది. అతను నదిలో దూకి బలవన్మరణం చేసుకున్నట్టు తెలుస్తోంది. సిద్దార్థ ఆచూకీ కోసం 200 మందికి పైగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. 130 మంది గజఈతగాళ్లు, ఇతర రెస్క్యూ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
కాగా సిద్దార్ధ మరణం కర్ణాటకలో కలకలం రేపుతోంది. కాఫీ వ్యాపారాన్ని విస్తరించి కాఫీ డే బ్రాండ్ తో సక్సెస్ సాధించిన వ్యాపారవేత్త అతను. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు అల్లుడు. అంతటి హైప్రొఫైల్ మనిషి సడేన్ గా అదృశ్యమయ్యాడు. సోమవారం సాయంత్రం నేత్రావతి నది దగ్గర జాతీయ రహదారిపై కారు ఆపి దిగారు. ఫోన్ మాట్లాడుతు వెళ్లారు. చివరగా ఉద్యోగులకు లెటర్ రాసి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడట్టు పోలీసులు భావిస్తున్నారు. సిద్దార్ధ మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com