ఆ విషయం గురించి నాకేం తెలుసు: కేటీఆర్

ఆ విషయం గురించి నాకేం తెలుసు: కేటీఆర్
X

మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ సిద్ధంగా ఉందన్నారు TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటిఆర్‌. కేబినెట్‌ విస్తరణపై చర్చించేందుకే గవర్నర్‌ను కలిశారనే వార్తలను ఆయన ఖండించారు. కేబినెట్‌ విస్తరణ గురించి తనకు ఏం తెలుసన్నారు? రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుపై కేటీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఇప్పటికే సభ్యత్వాలు అరకోటి దాటాయని చెప్పారు. గురువారం నుంచి ప్రమాద బీమా అమల్లోకి వస్తుందన్నారు. 11 కోట్ల 21 లక్షల ప్రీమియం చెక్‌ని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి కేటీఆర్ చెల్లించారు.

Tags

Next Story