వాళ్ళను తల్లిదండ్రుల వద్దకు చేర్చండి

అక్రమ చొరబాటు దారులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ముగిసిన అనంతరం 9 వందల మంది చిన్నారులను తల్లిదండ్రులనుంచి వేరుచేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అక్రమ వలసదారులనుంచి పిల్లలను వేరుచేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఫెడరల్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఇప్పటివరకు ఎంతమంది చిన్నారులను విడదీశారో వెల్లడించాలని కోరింది. దానిపై స్పందించిన ప్రభుత్వం ...నిబంధన ముగిసిన తర్వాత 9వందలమంది చిన్నారులను వేరుచేసినట్లు వెల్లడించింది. గతంలో తల్లిదండ్రుల నుంచి వేరుచేయబడిన 2వేల 8వందల మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని శాన్ డిగో డిస్టిక్ కోర్టు అప్పట్లో ఆదేశించింది. 2018 జూన్ లో ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. దీనిపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు న్యాయస్థానం కూడా తప్పుపట్టింది. దీంతో జూన్ 2019లో ఈ నిబంధనను నిలిపివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com