ఎన్నికల్లో సహకరించలేదని ఆ జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు

ఎన్నికల్లో సహకరించలేదని ఆ జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ మరింత ముదురుతోంది. ఎన్నికల్లో సహకరించలేదంటూ టీడీపీ కార్యకర్తలపై రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. అటు టీడీపీ నేతలు టార్గెట్ గా అటాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిస్తోంది టీడీపీ. కడప జిల్లాలో లేటెస్ట్గా టీడీపీ కార్యకర్తలపై కక్షదాడికి తెగబడి ఏకంగా ఇంటినే కూల్చేందుకు ప్రయత్నించారు. దీంతో భార్య భర్తలు ఇద్దరు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టారు.

కడప జిల్లా చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌, రేణుక టీడీపీ మద్దతుదారులు. అయితే..గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించారంటూ వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇంటిని పడగొట్టి.. ఇంటి మధ్యలో రోడ్డు వేసేందుకు స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నించారు. పోలీసులను వెంట బెట్టుకుని వచ్చి.. ఇంటి గోడను కూల్చారు. దీంతో మనస్థాపానికి గురైన శంకర్‌, రేణుక ఆత్మహత్యాయత్నం చేశారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా.. రోడ్డు వేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపు దాడులకు దిగుతుండటంతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఆందోళన బాట పట్లారు. అధికార పార్టీ దాడులను నిరసిస్తూ ర్యాలీలు చేపట్టారు. గుంటూరులో ఆందోళన చేపట్టిన తెలుగు యువత..వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడింది.

కర్నూలు జిల్లాలోనూ తెలుగు తమ్ముళ్లు పోరాటబాట పట్టారు. ఆలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ దాడుల నుంచి టీడీపీకి చెందిన ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. రోజుకో చోట రాజకీయ కక్ష దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. చివరికి రేషన్ డీలర్లను, ఆశా వర్కర్లను, ఫీల్ట్ అసిస్టెంట్లను టీడీపీ సానుభూతిపరుల పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story