జలసిరి సంతరించుకున్న బొగత జలపాతం

జలసిరి సంతరించుకున్న బొగత జలపాతం

ములుగు జిల్లాలోని బొగత జలపాతం జలకళ సంతరించుకుంది. వర్షాలకు జలసిరి నిండుగా రావడంతో ప్రకృతి అందాల మధ్య జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. జలధార అందాలను ఆస్వాదిస్తూ.. ఆ నీటిలో జలకాలాడుతూ మైమరచిపోయేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

తెలంగాణ నయాగరాగా ఖ్యాతిగాంచిన బొగత జలపాతం కొండకోనల మధ్య అద్భుతంగా కనువిందు చేస్తోంది. గలగల శబ్దాలు చేస్తూ ప్రవహించే పాలధారలా నురుగలు కక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ అందాలను చూస్తూ పర్యాటకులు తన్మయత్వానికి లోనవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story