వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై అనుమానాలు

వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై అనుమానాలు

హయత్‌నగర్‌ సోనీని కిడ్నాప్‌ చేసిన రవిశేఖర్‌ ఆడగడాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. హైదరాబాద్‌ గాజులరామారంలో ఉహాశ్రీ అనే వివాహితను సైతం అతనే కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉహశ్రీ కనిపించకపోవడంతో ఈ నెల 5న జీడిమెట్ల పీఎస్‌లోమిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఉహాశ్రీ ఫోటోలను వారి బంధువులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. అయితే... ఉహశ్రీ ఈ నెల 9వ తేదీన.. ఒంగోలులో కిడ్నాపర్‌ రవిశేఖర్‌ వెంట ఉన్నట్లు గుర్తించారు బంధువులు. ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించారు. దీంతో... పోలీసుల అదుపులో ఉన్న రవిశేఖర్‌ను విచారిస్తే.. తమ కూతురు ఆచూకి లభిస్తుందంటున్నారు ఉహశ్రీ తల్లిదండ్రులు.

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నాగరాజు, అరుణకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి ఉహాశ్రీని గాజులరామారానికి చెందిన మురళికిచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు. అయితే పెళ్లైన 6 నెలలకు మురళి.. ఉద్యోగ రిత్యా ఖతర్‌కు వెళ్లిపోయాడు. ఇంట్లో అత్త మామాలు, ఉహశ్రీ మాత్రమే ఉన్నారు. ఇదే సమయంలో... అత్త అనారోగ్యంగా ఉండటంతో.. ఆమె నంద్యాలకు వెళ్లింది. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోన్న మామా నాగరాజు.. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. ఉహశ్రీ కనిపించలేదు. దీంతో తెలిసిన వారందరని అడిగాడు. కానీ ఆమె ఆచూకి లభించకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోలను బంధువులకు పంపారు.

ఉహశ్రీని కిడ్నాపర్‌ రవిశేఖర్ వెంట చూశామని బంధువులు చెప్పడంతో... తల్లిదండ్రుల‌కు ఆశలు చిగురించాయి. రవిశేఖరే తనకూతురుని కిడ్నాప్‌ చేశాడని అనుమానిస్తున్నారు. రవిశేఖర్‌ను విచారిస్తే.. తమ కూతురి గురించి తెలుస్తుందంటున్నారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story