ఇండిపెండెన్స్ డే సందర్భంగా అమెజాన్ బంపరాఫర్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించనుంది. ‘ఫ్రీడమ్ సేల్ 2019’ పేరిట ఆగస్టు 8 నుంచి 11వ తేదీ వరకు ఈ ఆఫర్లు ఉండనున్నాయి. ఈ సేల్‌లో యాక్సెసరీస్, గృహ వినియోగ వస్తువులు, దుస్తులు, మొబైల్ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్‌ను అందించనుంది. బజాజ్ ఫైనాన్స్, ఇతర కార్డులపై నోకాస్ట్ ఈఎంఐతో పాటు డెబిట్‌కార్డుపై ఈఎంఐ వంటి సదుపాయాలను కూడా ఇవ్వనుంది.
ఈ భారీ డిస్కౌంట్ సేల్‌లో మొబైల్స్‌పై భారీ తగ్గింపు ప్రకటించనుంది. వన్‌ప్లస్ 7, ఒప్పొ రెనో, వివో వీ15, శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పొ ఎఫ్11 ప్రో ఫోన్ల ఎక్స్‌ఛేంజ్‌పై భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాక వన్‌ప్లస్ 7ప్రోపై ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌ను అందించనుంది. శాంసంగ్ మోడల్స్‌పై కూడా తగ్గింపు ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10, శాంసంగ్ ఎం40, ఎం30, ఎం20, రెడ్‌మీ వై3, ఒప్పొ ఏ7, ఆనర్ వ్యూ20, ఒప్పొ కే3 వంటి హాండ్ సెట్స్ ధరలపై తగ్గింపు ఉన్నట్లుగా తెలిపింది. అది ఎంత అన్నది వెల్లడించలేదు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటించనున్నట్లు వివరించింది. కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు లాంటి ప్యాషనబుల్ వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. వాటితో పాటు ల్యాప్‌టాప్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలతో పాటు ఇతర వస్తువులను తగ్గింపు ధరలకే అందించనుంది.ప్రైమ్ వినియోగదారులు ఆగస్టు 7న మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లు పొందొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com