పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు క్లోజ్!

మొన్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్. ఇప్పుడు అన్న క్యాంటీన్లు క్లోజ్. పేదోడి కడుపు నింపే అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు ఇన్నాళ్లు అన్నం పెట్టాయి. ఆత్మాభినంతో భోజనం చేసేలా క్యాంటీన్లను తీర్చిదిద్దారు. అయితే.. రాష్ట్రంలో 182 పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు నిర్మించారు. కానీ, నిర్ధిష్ట ప్రమాణాలు లేకపోవటంతో ఆయా క్యాంటీన్ల నామమాత్రంగా మిగిలిపోయాయి. 68 క్యాంటీన్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆ కొద్ది క్యాంటీన్లు కూడా క్లోజ్ కాబోతున్నాయి.
ఐదు రూపాయలకే టిఫిన్. ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం. ఐదు రూపాయలకే రాత్రి భోజనం. ఏ రోడ్డు పక్కనో, చెట్టు కిందో కాకుండా.. గౌరవంగా ఆహారం అందించేందుకు చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 15 రూపాయలు పెడితే.. మూడు పూటలా పేదల కడుపు నిండేది. ఇప్పుడవన్నీ మూతపడ్డాయి.
పనిమీద పట్నం వచ్చిన పేదలు, చిరు వ్యూపారులకు అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడ్డాయి. క్వాలిటీ విషయంలోను కాంప్రమైజ్ కాలేదు. మంచి పేరున్న అక్షయపాత్ర ఫౌండనేషన్‌కు బాధ్యత అప్పగించారు. వాళ్లతో ఒప్పందం కొనసాగింపునకు ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. పైగా.. 70 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. దీంతో.. భోజనశాలలు బంద్ అయ్యాయి.
అన్న క్యాంటీన్లను రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చి, భవనాలకు పసుపు స్థానంలో వైసీపీ రంగులద్ది కొనసాగిస్తారని అంతా భావించారు. ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తామనే చెప్తూ వచ్చింది. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
అన్నక్యాంటీన్లను మూసివేసే ఆలోచన కూడా లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స. అతితక్కువ ధరలకు మరింత న్యాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. క్యాంటీన్ భవనాలను ఎక్కడపడితే అక్కడ నిర్మించారని తప్పుబట్టారు. నిర్మాణాలకు 50 కోట్లు ఖర్చు అయినట్లు చెబుతున్న ఇంకా 40 కోట్లు పెండింగ్ లోనే ఉంచారు. త్వరలోనే మార్పులు చేర్పులతో రాయితీపై ఆహార క్యాంటీన్లను అందిస్తామని ప్రకటించారు బొత్స.
RELATED STORIES
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT