ఢిల్లీ ప్రజలకు తీపి కబురు అందించిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం

కశ్మీర్ టూ కన్యాకుమారి. ఎలక్షన్లకు ముందు అన్ని ప్రభుత్వాలు, పార్టీల సూత్రం ఉచితం. ఫ్రీ కాన్సెప్ట్ పవర్ చేర్ కు షార్ట్ కట్ లా మారిపోయింది. ఈ ఉచిత పథకాల జోరు ఢిల్లీని కూడా తాకింది. దేశ రాజధానిలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, ఉచితా తాయిలాలకు గేట్లు ఎత్తేస్తోంది.
ఎన్నికలకు ముందు కరెంట్ బిల్లు విషయంలో ఢిల్లీ ప్రజలకు తీపి కబురు అందించింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఫ్రీ కరెంట్ స్కీం ప్రకటించారు కేజ్రివాల్. 2 వందల యూనిట్లలోపు విద్యుత్ ఉపయోగించేవారికి ఉచిత్ విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి విద్యుత్ బిల్లులపై 50 శాతం రిబేట్ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంతో 33 శాతం మంది వినియోగదారులు లబ్ధి పొందుతారని అంచనా వేసింది.
ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడా నికి సీఎం కేజ్రీవాల్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉచితాలకు తెర లేపారు. ముందుగా మహిళా ఓట్లను టార్గెట్ చేసిన కేజ్రీవాల్, మహిళలందరికీ ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయాణం ప్రకటించారు. ఇప్పుడు, పేద-దిగువ మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసిన కేజ్రీవాల్, ఫ్రీ కరెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. 2 వందల యూనిట్లలోపు కరెంట్ వాడేవారికి ఎలాంటి బిల్లు రాదని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది సామాన్యులకు మేలు చేసే చారిత్రక నిర్ణయమని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com